Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జనం చూస్తుండగా నరికి చంపారు

కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గంపలగూడెం మండలం వినడప వంతెన వద్దకు ఓ వ్యక్తిని కొందరు ఆటోలో తీసుకువచ్చారు. జనం మొత్తం చూస్తుండగా, ప్రాణభయంతో ఉన్న అతన్ని నడి రోడ్డుపై అత్యంత పాశవికంగా నరికి చంపారు. అనంతరం వచ్చిన ఆటోలోనే వెళ్లిపోయారు. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. దీనిపై పోలీసులకు సమాచారమందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News